calender_icon.png 11 January, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు కమిషన్ సభ్యులుగా ఆరుగురు

22-10-2024 02:33:04 AM

నియామకంపై ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ రైతు కమిషన్‌కు నూతన సభ్యులను నియమించింది. ఇప్పటికే రైతు కమిషన్ చైర్మన్‌గా కోదండరెడ్డి కొనసాగుతుండగా, ఆరుగురు సభ్యులకు చోటు కల్పిస్తూ సోమవారం వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, న్యాయవాది సునీల్, రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, గడుగు గంగాధర్, కేవీ నర్సింహారెడ్డి, చెవిటి వెంకన్నయాదవ్, మరికంటి భవానీలను సభ్యులుగా నియమించింది. వీరు రెండేండ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.