వివరాలు వెల్లడించిన ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల అర్బన్, డిసెంబర్ 20: జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో సంచలనo సృస్టించిన దోపిడికి సంబందించిన కేసులో 6గురు నిందితులను అరెస్ట్ చేసి రు.5లక్షల విలువ గల 10తులాల బంగారం, 10వేల నగదు, రెండు బొమ్మ తుపాకీలు, 6సెల్ ఫోన్లు, రెండు బైకులు స్వాదీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
దొంగతనానికి సంబంధించిన వివరాలను శుక్రవారం ఎస్పీ మీడియా సమావేశం లో వెల్లడించారు. మున్నీసుల శ్రీనివాస్, చిప్పబత్తుల తులసయ్య , బక్కెనపల్లి అరుణ్, యశోద శ్రీనివాస్, సైదు సహదేవ్, రత్నం మాణిక్యం, ముకునూరి కిరణ్ కుమార్ ఒక గ్యాంగా ఏర్పడి కొన్ని రోజుల నుండి కిరణ్ వద్ద ఉన్న ఓ పరికరంతో గుప్త నిధుల కోసం వెతుకుతూ ఉండేవారని తెలిపారు.
గుప్త నిధులు దొరకకపోవడంతో దోపిడి చేసి డబ్బులు సంపాదించాలని పథకం వేశారని, ఇందులో భాగంగా బీర్పూర్ లోని వృద్ధ దంపతులు కాసం ఈశ్వరయ్య ఇంట్లో ఈనెల 13 అర్ధరాత్రి చొరబడి బొమ్మ తుపాకులతో ఈశ్వరయ్య దంపతులను బెదిరించి బంగారం, నగదును దొంగలించు కొని పారిపోయారని ఎస్పీ వెల్లడించారు.
దర్యాప్తులో భాగంగా డీఎస్పీ రఘు చందర్ ఆధ్వర్యం లో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా నిందితులు దర్మపురి మండలం లోని తుమ్మెనాల గుట్ట దగ్గర ఉన్నారనే సమాచారం మేరకు శుక్రవారం ఉదయం సహదేవ్ హోటల్ దగ్గర ఆరుగురు నింధితులను అదుపులోకి తీసు కొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారని తెలిపారు.
వారం రోజుల్లోనే దొంగతనం కేసును ఛేదించి నిందితులను పట్టుకున్న సిఐ వై. కృష్ణారెడ్డి, ఎస్సైలు కుమారస్వామి, సదాకర్, శ్రీదర్ రెడ్డి, దత్తాద్రి ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ అభినంధించి నగదు ప్రోత్సాహకం అందించారు.