calender_icon.png 9 January, 2025 | 1:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోమోస్ తిని మహిళ మృతి కేసులో ఆరుగురి అరెస్ట్

02-11-2024 02:15:34 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1 (విజయక్రాంతి): బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో మోమోస్ తిని ఇటీవల ఒక మహిళ మృతిచెందిన ఘటనలో బంజారాహిల్స్ పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నగరంలోని ఖైరతాబాద్ చింతల్ బస్తీ మొయిన్ రోడ్డులో నివాసముంటూ మోమోస్  వ్యాపా రం చేస్తున్న అల్మాస్ అలియాస్ అర్మా న్ సహా సాజిద్ హుస్సేన్, ఎండీ రయీస్,  ఎండీ షారూఖ్, ఎండీ హనీఫ్, ఎండీ రజీక్ అనే వ్యక్తులను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు బంజారాహిల్స్ ఏసీపీ వెల్లడించారు.

వీరంతా బీహార్ రాష్ట్రం కిషన్‌గంజ్‌కు చెందిన వారని, ఖైరతాబాద్‌లో  మోమోస్ వ్యాపారం చేస్తున్నట్లుగా గుర్తించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు జ్యుడీషియల్ రిమాండ్‌కు తర లించారు. అపరిశుభ్ర వాతావరణంలో, నాసిరకమైన పదార్థాలతో మోమోస్‌ను తయారు చేస్తున్నట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. మోమోస్, మైనీస్ శాంపిల్స్‌ను ల్యాబ్ కు పంపించినట్లు తెలుస్తోంది.