calender_icon.png 1 November, 2024 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోమోస్ కేసులో ఆరుగురు అరెస్ట్

01-11-2024 01:48:08 PM

హైదరాబాద్: బంజారాహిల్స్ మోమోస్ కేసులో ఆరుగురు కటకటాలపాలయ్యారు. మోమోస్ తిని ఇటీవల ఒకరు మృతి చెందగా పలువురు అనారోగ్యం పాలయ్యారు. చింతల్ బస్తీలో మోమోస్ తయారు చేస్తున్న అల్మాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మోమోస్ తయారీకి నాసిరకం పదార్థాలు వాడినట్లు గుర్తించారు. నాసిరకం, అపరిశుభ్రతతో మోమోస్ విషపదార్థంగా మారాయి. రేష్మ అనే మహిళ బంజారాహిల్స్ లో వారాంతపు సంతలో అమ్మిన మోమోస్ తిన్నారు. మోమోస్ తిన్నవెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించేలోపే రేష్మ చనిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మోమోస్ తిన్నవారిలో ఇంకా కొందరు చికిత్సపొందుతున్నారు.