calender_icon.png 26 December, 2024 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట ఆడుతున్న ఆరుగురి అరెస్ట్

25-12-2024 07:22:19 PM

నిజామాబాద్,(విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలోని పోలీస్ ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 17,838 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు రెండవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ యాసీర్ అరాఫత్ బుధవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి విశ్వాసనియ సమాచారం మేరకు దాడులు జరిపి దారుగల్లీలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను ఇబ్రహీం, జవీడ్, మోసిన్, జీయౌద్ధిన్, అమీరొద్ధిన్, షబ్బీర్ లను పట్టుకొని కేసు నమోదు చేసి వారి దగ్గర నుండి 17838/- రూపాయలను, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలిసిన పోలీసులకు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.