calender_icon.png 10 March, 2025 | 1:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరు గ్యారంటీలుకావు అవి ఆరు వంచనలు

21-01-2025 11:40:40 PM

బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని ఆరు గ్యారంటీ పథకాలు కావని అవి ఆరు వంచనలని నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం నిర్మల్ రూరల్ సోన్ మండలంలోని వివిధ గ్రామల పలు అభివద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. నిర్మల్ మండలంలోని అక్కపూర్ మూఠపూర్ సోన్ మండలంలోని వెల్మల్ బోప్పారం, సోన్, మాధాపూర్ గాంధీనగర్, పాక్‌పట్ల, సిద్దులకుంట తదితర గ్రామాల్లో పర్యటించి సిసి రోడ్లు, మురికి కాలువలు పార్మేషన్ రోడ్లు, భవనాలు ప్రారంభించారు. నిర్మల్ నియోజకవర్గంలో రూ.850 కోట్లతో వివిధ అభివృద్ది పనులు చేపట్టుతున్నాట్టు తెలిపారు.

ప్రభుత్వం జనవరి 26 నుండి అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయా భరోసా, కొత్త రేషన్‌కార్డులు, రైతులకు పెట్టుబడి సాయంపై గ్రామ సభలు నిర్వహించడం వెనుక అర్థం లేదన్నారు వేలాది దరఖాస్తులు వస్తే వాటిలో కొందరికి మాత్రమే ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పథకాలు అందేవరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. రైతులకు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హమీలు అమలు చేసేవరకు బీజేపి నిద్రపోదని ప్రభుత్వంను కూడ నిద్ర పోనివ్వమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి సీనియర్ నాయకులు సత్యనారాయణ గౌడ్ నేతలు గంగారెడ్డి గంగన్న తదితరులు ఉన్నారు.