* అండర్ జర్నీ తొలి పోరులో గెలుపు
* విండీస్‌ను చిత్తు చేసిన మన అమ్మాయిలు
* 9 వికెట్ల తేడాతో ఘన విజయం
కౌలాలంపూర్: అండర్ టీ20 ప్రపంచకప్ జర్నీని మన అమ్మాయిలు ఘనంగా ఆరంభించారు. విండీస్‌తో జరిగిన తొలి పోరులో భారత అమ్మాయిలు 9 వికెట్ల తేడా తో ఘన విజయం సాధించారు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ తొలి మ్యాచ్‌లో ఏకచత్రాధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న భారత అమ్మాయిలు విండీస్‌ను కేవలం 44 పరుగులకే కట్టడి చేశారు.
45 పరుగుల స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత సివంగులు కేవలం ఒక్కటంటే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యా న్ని చేధించారు. 2 వికెట్లతో మెరిసిన జోషితకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కిం ది. భారత్ 21న మలేషియా అమ్మాయిలతో తదుపరి మ్యాచ్‌లో తలపడనుంది.
విండీస్ విలవిల.. ఐదుగురు డకౌట్
టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న భారత అమ్మాయిలు విండీస్ బ్యాటర్లను పరుగులు చేయకుండా కట్టడి చేశారు. భారత బౌలర్ల దెబ్బకు ఐదుగురు విండీస్ బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరగ్గా.. మరో నలుగురు సింగిల్ డిజిట్‌కు పరిమితం అయ్యారు. విండీస్ ఇన్నింగ్స్‌లో కేనిక (15) టాప్ స్కోరర్.
ఓపెనర్లు జోడించిన 10 పరుగుల పార్ట్‌నర్‌షిపే అత్యధిక పార్ట్‌నర్‌షిప్ కావడం గమనార్హం. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మన సివంగులు 4.2 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యం చేధించారు. ఇక మరో మ్యాచ్‌లో శ్రీలంక అమ్మాయిలు 139 పరుగుల తేడాతో మలేషియా అమ్మాయిల మీద ఘన విజయం సాధించారు.