calender_icon.png 1 November, 2024 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివకార్తికేయన్ చిత్రంలో మలయాళ స్టార్

12-08-2024 12:00:00 AM

శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ బిజు మీనన్ పవర్ ఫుల్ రోల్‌లో నటిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్‌లో ఆయన జాయిన్ అయ్యారని వెల్లడించారు. కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఇందులో కథానాయిక కాగా, అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. సుదీప్ ఎలామన్ సినిమాటోగ్రఫీ, మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ కొరియోగ్రఫీ సేవలందిస్తున్నారు.