calender_icon.png 24 October, 2024 | 7:50 AM

గంటల తరబడి కూర్చుంటున్నారా?

05-09-2024 12:00:00 AM

బిజీ లైఫ్ లో చాలామంది గంటల తరబడి కుర్చీలకే అతుక్కుపోతుంటారు. మీరు కూడా గంటల తరబడి ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ కూర్చుంటున్నారా? అయితే జాగ్రత్త. గంటల తరబడి కూర్చుంటే అనారోగ్యం బారిన పడాల్సిందే. ఎక్కువ సేపు కూర్చున్నట్లయితే త్వరలో గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల స్థూలకాయం వస్తుందని ఇప్పటికే అధ్యయనాల్లో వెల్లడైంది. ఎక్కువగా కూర్చునట్లయితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తాజాగా జరిపిన అధ్యయనాల్లో వెల్లడైంది.

లింగ, వయోభేదాలు లేకుండా ఎవరికైనా సరే ఎక్కువ సమయం కూర్చుంటే గుండె జబ్బుల బారిన పడటం ఖాయమని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 45ఏళ్లు దాటిన వారిలో సరైన శారీర శ్రమలేక గుండెపోట్లు ఎక్కువగా వస్తున్నాయని భావించి ఆపై వయస్సు వారిపైనే ఈ అధ్యయనం జరిపారు. రోజులో కొంత సమయం శారీరక శ్రమకు కేటాయించాలని అమెరికా శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కాబట్టి వీలైనంతవరకు 45 నిమిషాలకొకసారి కాలు కదిపితే బెటర్.