calender_icon.png 23 February, 2025 | 2:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి స్థల పరిశీలన

21-02-2025 12:00:00 AM

మేడ్చల్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లాలో ఎస్సీ, ఎస్టి, బిసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో నిర్మాణానికి వివిధ ప్రాంతాల్లో స్థలాలను కలెక్టర్ గౌతం, స్టేట్ ఫ్లాగ్ షిప్ స్కీమ్స్ కమిషనర్ శశాంక్ పరిశీలించారు.  కూకట్‌పల్లిలోని సర్వే నంబరు 1009లోని హౌజింగ్ బోర్డు స్థలాల వివరాలను ప్లాన్ ప్రకారం కలెక్టర్, కమీషనరుకు  వివరించారు.

తరువాత  కుత్బుల్లాపూర్  మండలంలోని గాజులరామారం సర్వే నెం . 220 లోని20 ఎకరాల  ప్రభుత్వ స్థలాన్ని కమీషనరు, కలెక్టరు  పరిశీలించారు. అనంతరం  కాప్రా మండలం లోని జవహార్ నగర్ లోని సర్వే నంబరు 12 లోని 20 ఎకరాల స్థలాన్ని ఇంటిగ్రేటెడ్  స్కూల్స్ నిర్మాణానికి గాను జిల్లా అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి మ్యాప్ ల ద్వారా వివరాలను తెలియజేసారు.

ఈ పర్యటనలో జిల్లా అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి, మల్కాజిగిరి ఆర్డిఓ శ్యాంప్రకాష్, కీసర ఆర్డిఓ ఉపేందర్ రెడ్డి, కూకట్ పల్లి తహాసీల్దారు స్వామి, కాప్రా తహాసీల్దారు సుచరిత, కుత్బుల్లాపూర్ తహాసీల్దారు, తదితరులు పాల్గొన్నారు.