calender_icon.png 5 February, 2025 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జంక్షన్ ఏర్పాటుకు స్థల పరిశీలన

05-02-2025 01:07:51 AM

*- ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం 

*- మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి 

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 4 (విజయ క్రాంతి) : ఎన్ని గంటలు ప్రత్యేకంగా జంక్షన్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరిశీలించినట్లు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం జంక్షన్కు సంబంధించి ప్రధాన రోడ్డుపై ఏనుగొండలోని తదితర ప్రాంతాలలో కాలనీవాసులతో కలిసి ప్రత్యేకంగా పరిశీలించారు.

ఏనుగొండలోని  మైసమ్మ గుడి ముందర అంబేద్కర్ చౌరస్తాలో  నేషనల్ హైవే 167  రాయచూర్, హైదరాబాద్ అంతరాష్ర్ట రహదారిపై ప్రమాదాల నివారణకు జంక్షన్ ఏర్పాటు చేసి సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు కు కాలనీవాసులు గత కొన్ని రోజుల క్రితం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.   తొందరలోనే అక్కడ జంక్షన్ ఏర్పాటు చేస్తామని కమిషనర్ తెలిపారు.

ఇట్టి విషయంపై గ్రామస్తులు అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మల్లెపోగు శ్రీనివాస్ పురుషోత్తం గౌడ్, యాంకి రమేష్  జెమినీ కష్ణ, వెంకట్ నర్సింలు  భాస్కర్  కాలే గోపాల్, మధు, తోకలగోపి,  గద్ద మన్నెం,తోకల బాల నాగయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.