16-04-2025 10:23:35 PM
మందమర్రి (విజయక్రాంతి): మండల మహిళా సమాఖ్యకు మంజూరైన పెట్రోల్ బంక్ ఏర్పాటుకు జిల్లా డిఆర్డిఏ పిడి కిషన్ స్థలాన్ని పరిశీలించారు. బుదవారం తహశీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీఓ రాజేశ్వర్ లతో కలసి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. మండల మహిళా సమాఖ్య కు పెట్రోల్ బంక్ మంజూరు కాగా త్వరలోనే స్థల పరిశీలన పూర్తి చేసి పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈజిఎస్ ఏపీఓ రజియా సుల్తానా, ఆర్ ఐ గణపతి లు పాల్గొన్నారు.