07-04-2025 12:56:02 AM
శోభ యాత్రలో పాల్గొన్న
ఎమ్మెల్యేలు పోలీసుల భారీ బందోబస్తు
కామారెడ్డి, ఏప్రిల్ 6( విజయక్రాంతి), కామారెడ్డి జిల్లాలో శ్రీరామనవమి సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం శోభయాత్రను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. బిచ్కుందలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శోభయాత్ర ప్రారంభించి పాల్గొన్నారు. బాన్సువాడ ఎల్లారెడ్డి లో శోభయాత్ర నిర్వహించారు.
వేలాది మంది హిందూ వాహిని ప్రతినిధులు శోభయాత్రలో పాల్గొన్నారు. డీజే సౌండ్ సిస్టం తో పాటు లైటింగ్ ఏర్పాటు చేసి ప్రధాన వీధుల గుండా శోభాయాత్రను నిర్వహించారు. ఎలాంటి అవాంచని సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. శోభాయాత్ర అర్ధరాత్రి వరకు చేపట్టారు. ఆర్‌ఎస్‌ఎస్ బజరంగ్దళ్ నాయకులతోపాటు హిందూ వాహిని సోదరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో సీతారామ కళ్యాణం, రామాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సంకష్టహర మహా గణపతి ఆలయంలో ఎన్జీవోస్ కాలనీలోని సీతారామాంజనేయ ఆలయ ంలో దేవునిపల్లిలోని రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో సీతారామ కళ్యాణం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
అడ్లూరు ఎల్లారెడ్డి, లింగాపూర్, చిన్న మల్లారెడ్డి, రామేశ్వర్ పల్లి, అడ్లూరు, రామా రెడ్డి, తాడ్వాయి, భిక్కనూర్, దోమకొండ, ఎల్లారెడ్డి, మాచారెడ్డి, చుక్కాపూర్, రెడ్డిపేట్, బాన్సువాడ, బిచ్కుంద, పిట్లం ,నిజాంసాగర్, నాగిరెడ్డిపేట్, తదితర మండల కేంద్రాల్లో ఘనంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. వేద పండితుల మంత్రోత్సవాల మధ్య సీతారాముల కళ్యాణం ఘనంగా భక్తులు నిర్వహించారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి, సీతాయిపల్లి ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, గాంధారి, రామారెడ్డి లలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సీతారామ చంద్రుల కళ్యాణం లో పాల్గొన్నారు. బాన్సువాడ లోని శ్రీరామ కాలనీ రామాలయం, దేశాయిపేట్ రామాలయం, కొల్లూరు రామాలయం తిరుమలపూర్, బీర్కూర్ రామాలయాలతో పాటు పోచారం స్వగ్రామం లోని రామాలయంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన సతీమణి పుష్ప తో కలిసి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.
జుక్కల్ నియోజకవర్గం లోని నిజాంసాగర్ మండలం అచ్చంపేటలోని రామాలయం లో పట్లోళ్ల కిషోర్ కుమార్ రెడ్డి పట్టు వస్త్రాలను స్వామివారిలకు పంపించారు. మద్నూర్, పెద్ద కొడపుగల్, జుక్కల్, బిచ్కుంద, పిట్లం, మండలాల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నిర్వహించిన సీతారామా కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను తిలకించారు. కళ్యాణోత్సవంలో సీతారాముల విగ్రహాలకు తలంబ్రాలు పోశారు. మహిళలు ఓడి బియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఆలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా భక్తులు సీతారాముల కళ్యాణం ఉత్సవాలు పాల్గొని తరించారు.
మండల కేంద్రములో శివరామ మందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేవాలయ ఆలయ ధర్మకర్తలు కొండ అంజయ్య దంపతులతో పాటు ధర్మకర్తలు దేవతామూర్తులను ఊరేగింపుగా తీసుకు వచ్చి శ్రీ సీతారామ చంద్రుల కళ్యాణం జరిపించారు. సీతరామల కళ్యాణం చైత్రశుద్ద నవమి సందర్భంగా నిర్వహించే కల్యాణ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఎండోమెంట్ కార్యదర్శి ప్రభు. ధర్మకర్తలు పలు పార్టీలకు చెందిన నాయకులు పలుకుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం సీతారాముల కళ్యాణం సందర్భంగా మహిళలు ఓడిబియాలను పోసి మొక్కులు చెల్లించుకున్నారు.
బాన్సువాడ
బాన్స్ వాడ, ఏప్రిల్ 06(విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లోని పలు మండల కేంద్రాలు, గ్రామాలలో శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం సీతారాముల కళ్యాణం ఘనంగా వైభవంగా నిర్వహించారు. శ్రీరామ నవమి సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని శ్రీరామ కాలనీ రామాలయం, బాన్సువాడ రూరల్ మండలం దేశాయిపేట రామాలయం, కొల్లూరు రామాలయం, తిర్మలాపూర్ రామాలయం,బీర్కూరు మండల కేంద్రంలోని రామాలయం స్వగ్రామం పోచారం రామాలయాలలో జరిగిన సీతారాముల కళ్యాణంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి సతీమణి పుష్ప తో కలిసి పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి . శ్రీరామనవమి సందర్భంగా స్వామి వారి కళ్యాణంలో పాల్గొన్నారు ఆయనతోపాటు అతని సోదరుడు పోచారం శంభు రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పోచారం సురేందర్ రెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని సిద్దుల గుట్టపై ఆదివారం శ్రీరామనడం వేడుకలు ఘనంగా నిర్వహించారు వేద మంత్రాల పట్టణంతో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. సీతారాముల వారి విగ్రహాలను పాలాభిషేకంతో అభిషేకించరూ. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ కూడా హాజరయ్యారు స్వామివారికి తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించారు.
నిజామాబాద్ జిల్లాలో
నిజామాబాద్ ఏప్రిల్ 6: (విజయ క్రాంతి) : శ్రీ సీతారాముల కళ్యాణం చూసినా విన్నవారి జన్మ ధన్యమవుతుందని నిత్య నూతనంగా ఉండే పరమాత్ముని స్మరించుకుంటే జన్మజన్మల పాపాలు పటాపంచలై మనిషి జన్మకి సార్ధకత లభిస్తుందని వేదపండితులు భక్తకోటికి తెలియజేస్తున్నారు. హైందవ సంస్కృతి సనాతన ధర్మం అంటే ఏమిటి భక్తి అంటే ఏమిటి భక్తి ఎలా ఉండాలి అనే విషయాలను అర్థమయ్యేలా వేద పండితులు గురువులు శ్రీరామనవ సందర్భంగా భక్తకోటికి ప్రవచనాలు వినిపించారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని ఆలయాల్లో అంగరంగ వైభవంగా శ్రీ కోదండ సీతరామ స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది. నిజామాబాద్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చ్‌ణ్యక్షేత్రమైన రామాలయంలో ఈరోజు ఉదయం నుండే కళ్యాణ మహోత్సవాలు మొదలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని బడా రామ్ మందిర్ లో ఉదయం శ్రీ శ్రీరామచంద్రస్వామి నీ ఉయ్యాలలో వేసి ఉదయం జన్మదిన వేడుకలు స్వామివారికి జరిపారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ వేద పండితుల మధ్య హాజరై శ్రీరామనవమి ప్రాముఖ్యతను భక్తజనానికి శుభాకాంక్షలు తెలిపి బడా రామ్ మందిర్ సీతారామ స్వామిని దర్శించుకుని పరస్పర రంగుల కేలీలో ఆయన పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలు ఆనందోత్సవాల మధ్య ఉత్సవాలు జిల్లాలో జరిగాయి. లొద్ది రామన్నకి పట్టు వస్త్రాలు సమర్పించిన టీఎస్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
భీమ్గల్ మండలంలోని పిప్పి గ్రామంలోని శ్రీ లొద్ది రామన్న స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సతీసమేతంగా వచ్చి సీతారామ కళ్యాణం మహోత్సవంలో పాల్గొని శ్రీరాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. మహేష్ కుమార్ గౌడ్ తో పాటు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సీతారామస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.
శ్రీరామ్ సాగర్ పోచంపాడు శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవం లో సతీసమేతంగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. శ్రీరామ నవమి పర్వదిన వేడుకల్లో పట్టుసో వస్త్రాలు సమర్పించిన వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు స్వామి వారి కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమానికి తమ వంతు సహకారంగా చేయూతనిచ్చారు భక్తజనులతో కిటకిటలాడిన శ్రీరామచంద్రమూర్తి దేవాలయాల్లో భక్తుల తో దేవాలయాలు కిటకిటలాడిపోయాయి.
ప్రధాన కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని భక్తులకు స్వామి వారి అన్నప్రసాదాన్ని ప్రశాంత్ రెడ్డి వడ్డించారు. నిజామాబాద్ రూరల్ పరిధిలోని ప్రసిద్ధ డిచ్ పల్లి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రత్యేక కన్నుల పండుగగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో స్వాముల వారి కళ్యాణం జరుగుతుంది. శరీరం ఉంటేనే ఖర్మ ఉంటుందని కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచప్రాణులు దైవం ఉండటం వలన కర్మ ఫలితాలు కలుగుతాయని శ్రీ సీతారాముల కళ్యాణం హిందు వాహిని హైందవసేన ఉత్సవ సమితి పంచముఖి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నంబి నరహరి శౌర్య కృష్ణ పురోహితులు కన్నుల పండుగగా నిర్వహించిన సీతారామస్వామి కళ్యాణ మహోత్సవంలో కళ్యాణ విశిష్టతను సిద్ధాంతులు వివరించారు.
నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయంలో స్వామివారి కల్యాణ మహోత్సవం. రంగ రంగ వైభవంగా జరిగింది. నిజామాబాద్ మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తకోటికి అన్నప్రసాదాలు అందజేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామ యువకుల ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం జరిగింది.
కార్యక్రమానికి తండోపతండాలుగా గ్రామా ప్రజలతోపాటు సమీప గ్రామా ల ప్రజలు అందరూ హాజరయ్యారు.ఉదయం తొట్టల కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం శ్రీరామచంద్రస్వామి పట్టాభిషేకం అనంతరం శ్రీ సీతరామ స్వామి కళ్యాణం కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జిల్లాలోని చిన్న ఆలయాలు మొదలుకొని ప్రముఖ ఆలయాల్లో శ్రీరామ స్వామి నామస్వాములతో మారుమోగి పోయాయి.
పట్టాభిషేక అనంతరం శ్రీరామనవమి రోజు అయిన ఆదివారం సాయం త్రం స్వామివారి కల్యాణ విగ్రహాలు రతంపై మరికొన్ని మందిరాల్లో ఆలయ పరిసర ప్రాంతాల్లో రథ ఊరేగింపులు నిర్వహించారు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీరామ సీతారామస్వామిని భక్తులు కొలిచారు.