calender_icon.png 27 November, 2024 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారామ ప్రాజెక్టు వాదులాట ఎఫెక్ట్

06-11-2024 01:49:14 AM

  1. ఇద్దరు ఇరిగేషన్ అధికారులకు మెమోలు 
  2. సీఈ, ఈఎన్సీపై సర్కారు చర్యలు
  3. అధికారుల వ్యవహారంపై సీఎం సీరియస్
  4. సీతారామ టెండర్లకు ఆమోదం లభించే అవకాశం?

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాం తి): ఈ నెల 2వ తేదీన సీతారామ ప్రాజెక్టుపై సమీక్ష సందర్భంగా మంత్రుల ఎదుటే వా దులాటకు దిగిన నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్(సీఈ) శ్రీనివాసరెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ (-ఈఎన్సీ) అనిల్‌కుమార్‌పై సర్కారు చ ర్యలు తీసుకుంది. ఇద్దరికీ నీటిపారుదల శా ఖ కార్యదర్శి  మెమోలు జారీ చేశారు.

సీతారామ ప్రాజెక్టు కింద డిస్ట్రిబ్యూటరీ నిర్మా ణం, అనుబంధ పనుల టెండర్ల నిర్వహణ లో జరిగిన తప్పిదాలపై మంత్రి తుమ్మలతో కలిసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 2వ తేదీన జలసౌధలో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులకు పరిపాలనపర అను మతుల కోసం సీఈ, ఈఎన్సీ మంత్రుల ఎదుటే వాదులాటకు దిగినట్లు సమాచా రం.

ఈ నేపథ్యంలో  మంత్రి ఉత్తమ్ ఆదేశాలతో ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఇరువురు అధికారులకు మెమోలు జారీ చేశారు. కాగా సీ తారామ ఎత్తిపోతల పథకానికి రూ. 7,926.14 కోట్ల అంచనాతో 2016 ఫిబ్రవరి 18న పరిపాలనాపరమైన అనుమతులివ్వ గా, 2018 ఆగస్టులో రూ.13,057 కోట్లకు పెంచారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దీనిని తప్పుబడుతూ మంత్రులు తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ఆదివారం  కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు.

టెండర్లకు సీవోటీ ఆమోదం లభించే అవకాశం?

డిస్ట్రిబ్యూటరీలు సహా ఇతర పనులకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కోసం కొత్తగూడెం సీఈ గత నెలలో నీటిపారుదల శాఖకు ప్రతిపాదనలు పంపగా డిటైల్డ్ ఎస్టిమేట్స్, డిజై న్స్, డ్రాయింగ్స్ లేకపోవడంతో వాటిని స మర్పించాలని కోరుతూ ఈఎన్‌సీ ఆ ప్రతిపాదనలను తిప్పిపంపారు. కాగా గత నెలలో నిర్వహించిన ఓ సమీక్షలో మంత్రులు ఆదేశించడంతో ప్రాజెక్టు అధికారులు టెండర్లను ఆహ్వానించినట్లు సమాచారం.

అయితే ఈ అంశంలో అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం పెద్ద సమస్యగా మారిందని నీటిపారుదల శాఖలో చర్చ జరుగుతోంది.  పా లనాపరమైన, ఆర్థికపరమైన అనుమతులు లేకుండానే పిలిచిన టెండర్లకు కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ) కమిటీ ఆమోదముద్ర లభించే అవకాశం ఉన్నట్లుగానే సమాచారం అందుతోంది. వీటి రద్దుకు సర్కారు మొగ్గుచూపడం లేదని తెలుస్తోంది.

1074 కోట్ల అంచనాతో టెండర్లు

కాగా సీతారామ ఎత్తిపోతల పథకం లో భాగంగా రూ.1074 కోట్ల అంచనా వ్యయంతో డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు టెండర్లు పిలిచారు. సెప్టెంబరు 28,- అక్టోబరు 5 మధ్యకాలంలో 7 వేర్వేరు పనుల కోసం మొత్తం రూ.1,842 కోట్ల అంచనాలతో అధికారులు టెండర్లను ఆహ్వానించారు.

ఇందు లో సుమారు రూ.768 కోట్లు విలువ చేసే పనులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఆ మేరకు పరిపాలనపరమైన అనుమతులను నీటిపారుదల శాఖ జారీ చేసింది. మిగిలిన రూ.1,074 కోట్ల పనులకు అనుమతులను ఆర్థిక శాఖ పెండిం గ్‌లో ఉంచింది. అయినప్పటికీ సర్కారు టెండర్లను ఆమోదించే అవకాశమే ఉన్నట్లుగా తెలుస్తోంది.