హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): ఈ నెల 11న సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ జరుగనుంది. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగనుంది. అనంతరం ఈ నెల 15న సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ తరుణంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 11న రెండో, మూడో పంప్‌హౌస్ ప్రాజెక్టు ట్రయల్ రన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఈ నెల 15న వైరాలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను సైతం మంత్రి పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత నల్గొండ జిల్లా అడివిదేవులపల్లి మండలం దున్నపోతుల గండికి చేరుకుని అక్కడ నిర్మించనున్న ఎత్తిపోతల పథకం స్థల పరిశీలన చేస్తారు. అనంతరం మిర్యాలగూడలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.