calender_icon.png 5 April, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాపాక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం

04-04-2025 01:38:29 PM

ఘనంగా కూచిపూడి భరతనాట్య కార్యక్రమాలు.

చిట్యాల,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం(Chityala mandal)లోని నైన్ పాక గ్రామంలోని నాపాక దేవాలయ ప్రాంగణంలో 6వ తేదీన ఘనంగా శ్రీరామనవమి(Rama Navami) వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ యాదడ్ల రాజయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు,పలువురు రాజకీయ నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ ప్రాచీన ఆలయం రాష్ట్రంలో ఎక్కడ లేని విధానం ఒకే శిలపై నాలుగు ద్వారాలకు నాలుగు విగ్రహాలను రూపొందించి ఉంటుందని తెలిపారు.

ఏకశిలపై గుడిని ప్రాచీన కట్టడాలతో నిర్మించి ఉన్న విశిష్ట గల దేవాలయం అని పేర్కొన్నారు.రానున్న రోజుల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే(Bhupalpalle MLA)  సహకారంతో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి జరిగేలా కృషి చేస్తామని అన్నారు.సీతారాముల కళ్యాణం అనంతరం నృత్య రవళి కళాక్షేత్రం హనుమకొండ 40 మందితో కూచిపూడి భరతనాట్యం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా, మండలాల్లోని వివిధ గ్రామాల భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందలాని కోరారు.