calender_icon.png 23 December, 2024 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారాం ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని నష్టం

13-09-2024 08:18:13 PM

సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తొడసం భీంరావు

ఆదిలాబాద్(విజయక్రాంతి): సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికే కాదు, యావత్తు దేశ రాజకీయాలకు తీరని లోటని పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తొడసం భీంరావు  అన్నారు. సీతారాం ఏచూరి సంతాప సభను పార్టీ సీనియర్ నాయకులు బండి దత్తాత్రి అధ్యక్షతన స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భీంరావు మాట్లాడుతూ... దేశం గొప్ప రాజకీయ మేధావిని కోల్పోయింది అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై పూర్తి స్థాయిలో పట్టు కలిగిన నేత సీతారాం ఏచూరి అని కొనియాడారు. విద్యార్థి దశలోనే ఎర్రజెండా భావాల వైపు మళ్లారు, జే.ఎన్.యు.లో ఎస్ఎఫ్ఐ నుండీ మూడుసార్లు అధ్యక్షునిగా గెలుపొందారు అన్నారు.

వైస్ ఛాన్సలర్ గా ఇందిర గాందీ రాజీనామా చేయాలనీ తన ఇంటికే విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి హైరాన్ లేడీగా పేరున్న ఇందిరా గాంధీనీ తనముందే రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారని గుర్తు చేశారు. యూపీఏ మొదటి ప్రభుత్వంలో కామన్ మినీమమ్ ప్రోగ్రాం రుపొందించడం కీలక పాత్ర పోసించారన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా 10సంవత్సరాలు సేవలందించారని, బెస్ట్ పార్లమెంటిరియన్ గా పేరుతెచ్చుకున్నారన్నారు. బ్రతికుండా గా దేశానికి సేవచేయడమే కాకుండా మరణించాక కూడా ఎయిమ్స్ కు రీచర్చు నిమిత్తం తన బాడీని దహనం చేసి దేశానికి సేవలు అందించి అందరికీ  ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంక రాఘవులు, అన్నమొల్ల కిరణ్, పూసం సచిన్, జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ ఆశన్న, మంజుల సురేందర్, గంగన్న, ఐద్వా జిల్లా కార్యదర్శి లంక జమున, నాయకులు, కోవే శకుంతల అగ్గిమల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.