calender_icon.png 23 October, 2024 | 11:19 PM

వామపక్ష ఉద్యమాలకు దిక్సూచి సీతారాం ఏచూరి

14-09-2024 04:41:31 PM

గోదా శ్రీరాములు (సిపిఐ జిల్లా కార్యదర్శి)

ఎండి జహంగీర్ (సిపిఎం జిల్లా కార్యదర్శి)

పోతంశెట్టి వెంకటేశ్వర్లు (భువనగిరి మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్)

రాచకొండ జనార్ధన్ (సిపిఐ (ఎం.ఎల్) జిల్లా కార్యదర్శి)

యాదాద్రిభువనగిరి (విజయక్రాంతి): సిపిఎం అఖిలభారత కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం యావత్ భారత రాజకీయాలకు తీరనిలోటని వామపక్ష ఉద్యమాలకు ఒక దిక్సూచి లాంటి గొప్ప నాయకుల్ని కోల్పోయామని సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతశెట్టి వెంకటేశ్వర్లు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాచకొండ జనార్ధన్ అన్నారు. శనివారం స్థానిక సుందరయ్య భవనంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన నిర్వహించిన ఏచూరి సంతాప సభలో వారు ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడుతూ.. భారతదేశ రాజకీయాలను గాడిలో పెట్టడంలో వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమాలకు దిశా నిర్దేశం చేయడంలో సీతారాం ఏచూరి పాత్ర గొప్పదని, అప్పటి సంకీర్ణ ప్రభుత్వంలో ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వానికి రాజకీయ విధానం పట్ల అవగాహన కల్పించిన గొప్ప మేధావి అని వారు కొనియాడారు.

ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు పేద, మధ్యతరగతి ప్రజల జీవన పరిణామాలు దృష్టిలో పెట్టుకుని యూపీఏ ప్రభుత్వానికి కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉపయోగపడాలని రాజకీయ తీర్మానాన్ని తీసుకురావడంలో, సమాచార హక్కు చట్టం అమలు చేయడంలో, గిరిజన హక్కుల చట్టాలను తీసుకురావడంలో సీతారాం ఏచూరి పాత్ర మరువలేనిదని వారు అన్నారు. ప్రస్తుతం మతోన్మాదం పెరుగుతున్న క్రమంలో దేశానికి రాజకీయ విధానం పట్ల, మతోన్మాద భావజాలాన్ని అడ్డుకట్ట వేయడం విషయంలో కీలకమైన గొప్ప నాయకుడు దూరం కావడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని లోటని వారు అన్నారు. అదేవిధంగా అనేకమంది మహా నాయకులు ఏచూరి నాయకత్వంలో ప్రజా ఉద్యమాలు నడిపారని నేటితరం నాయకులకు ఏచూరి జీవితం ఆదర్శప్రాయంగా ఉండాలని ప్రపంచం గర్వించే గొప్ప నాయకుడు ఏచూరి అని వారు అన్నారు.

పార్టీలకు అతీతంగా ఏచూరి సలహాలు సూచనలు తీసుకునేవారని ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో సీతారాం ఏచూరి పాత్ర తప్పక ఉందని వారు అన్నారు. ఏచూరి మరణం వామపక్ష ఉద్యమాలకే కాకుండా భారతదేశ రాజకీయ వ్యవస్థకు తీరని లోటని అలాంటి గొప్ప నాయకులు ప్రస్తుత రాజకీయలో ముందుకు రావాలని, సీతారాం ఏచూరి స్ఫూర్తితో మతోన్మాదం, ఫాసిజానికి వ్యతిరేకంగా దేశంలో పేద మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఉధృత పోరాటాలు నిర్వహించి ఏచూరి ఆశయాలను సాధించే దిశగా ప్రయాణం చేస్తామని వారు అన్నారు.

వీరితోపాటు సంతాప సభలో బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మంగ నర్సింహులు, మాటూరు బాలరాజు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్, చెక్క వెంకటేష్, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు దేవరకొండ నరసింహాచారి, మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్ మరియు ప్రజా సంఘాల నాయకులు దయ్యాల నరసింహ, మాయ కృష్ణ, మద్దెల రాజయ్య, సిర్పంగి స్వామి, మద్దెపురం రాజు, ముక్కెర్ల యాదయ్య, గడ్డం వెంకటేష్, వనం ఉపేందర్, బోలగాని జయరాములు, రాగిరు కిష్టయ్య, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, ఈర్లపల్లి ముత్యాలు, లావుడియా రాజు, పగడాల శివ, మేకల బాలు, ఏదునూరి మల్లేశం, బోడ భాగ్య, లలిత, నాగమణి, తడక మోహన్, పల్లె మద్దుకృష్ణ, ఎల్ అరుణ, సురేందర్ రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.