calender_icon.png 17 January, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత బ్యాటింగ్ కోచ్‌గా సీతాన్షు

17-01-2025 12:00:00 AM

న్యూఢిల్లీ: టీమిండియా కొత్త బ్యా టింగ్ కోచ్‌గా మాజీ సౌరాష్ట్ర బ్యాటర్ సీ తాన్షు కొటక్ ఎంపికయ్యాడు. 52 ఏళ్ల సీతాన్షు కొటక్ కొన్నేళ్లుగా నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో బ్యాటింగ్ కోచ్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌తో పాటు చాంపియన్స్ ట్రోఫీ ముంగిట సీతాన్షును బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికవ్వడం ఆసక్తి రేపింది.

‘కోచ్‌గా అభిషేక్ నాయర్ వైఫల్యంతో సీతాన్షు కొటక్ స్పెషలిస్ట్ బ్యాటింగ్ కోచ్‌గా పనిచేయనున్నాడు. కవర్ డ్రైవ్స్, ఫ్లిక్ షాట్స్ ఆడడంలో నేర్పరి అయిన సీతాన్షు రాకతో టీమిండియా బ్యాటింగ్‌లో సమూల మార్పు రానుంది’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. కాగా సీతాన్షు కొటక్ 130 ఫ్లస్ట్‌క్లాస్ మ్యా చ్‌ల్లో 8వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో 15 శతకాలు ఉన్నాయి.