calender_icon.png 24 September, 2024 | 4:52 AM

సీతక్కా.. నేను మీ ఫ్యాన్

24-09-2024 02:47:25 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి) :  ‘ సీతక్క నేను మీ ఫ్యాన్‌ని ’ అని హీరో మహేశ్‌బాబు సతీమణి నమ్రత మంత్రితో ఫొటో దిగారు. వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన విరాళాన్ని టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి చెక్కు రూపంలో అందజేశారు. మహేశ్‌బాబు వెంట ఆయన సతీమణి నమ్రత కూడా ఉన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి చెక్ అందించిన సమయంలో మంత్రి సీతక్క కూడా అక్కడే ఉన్నారు. మంత్రి సీతక్కకు వద్దకు వెళ్లిన నమ్రత ఫొటో దిగారు.