22-04-2025 12:00:00 AM
హుజురాబాద్, ఏప్రిల్21 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం లోనిఇల్లంద కుంట అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం హుండీ లెక్కించనున్నట్లు ఆలయ చైర్మన్ రామారావు తెలిపారు. సోమవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
హుండీ లెక్కింపుల దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉండి లెక్కింపులో పాల్గొనే భక్తులు డ్రెస్ కోడ్ (లుంగీ& బనియన్) కు అనుగుణంగా హాజరుకావాలని అన్నారు. హుండీ లెక్కింపు ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి కార్యక్రమాలకు ఉపయోగిస్తామని తెలిపారు.