06-04-2025 07:30:28 PM
కొల్చారం (విజయక్రాంతి): శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మండల వ్యాప్తంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రమైన కొల్చారం రాంపూర్ రంగంపేట వరిగుంతం అంసాన్ పల్లి గ్రామాలలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రమైన కొల్చారంలో గ్రామ పురోహితులు శ్రీనివాస శర్మ స్వగృహం నుండి ఉత్సవ విగ్రహాలను డిజె సౌండ్ తో శివాలయం వరకు ఆటపాటలతో జైశ్రీరామ్ నినాదాలతో మహిళల కోలాటాలతో భారీ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం కోలాచలం శ్రీనివాస శర్మ మంత్రోత్సరాలతో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు సంఘమిత్ర యువజన సంఘ సభ్యులు చత్రపతి యువసేన సంఘ సభ్యులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.