calender_icon.png 7 April, 2025 | 6:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాచగిరి క్షేత్రంలో ఘనంగా సీతారామ కళ్యాణం

06-04-2025 05:07:19 PM

గజ్వేల్: సిద్దిపేట జిల్లా నాచగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం సీతారాముల కల్యాణాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణ దాత శ్రీ గంప శివకుమార్ కుటుంబ ఆధ్వర్యంలో జరిగిన సీతారామ కళ్యాణం క్రతువును ప్రధానార్చకులు జగన్నాథచార్యుల, అర్చకులు రమేష్ శర్మ, గోపాల కృష్ణ శర్మ విద్యాసాగర శర్మలు వేదమంత్రోచ్చరణలతో నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అధికారులు సుధాకర్ గౌడ్, నరేందర్ గౌడ్, పాండు తదితరులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.