05-04-2025 07:15:53 PM
పిట్లం (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం చెందిన ఓ బాలిక మందారం ఆకు, బొండుమల్లి ఆకులపై పలు చిత్రాలు వేస్తూ అందరిని అబ్బురపరుస్తుంది. ఆదివారం శ్రీ రామనవమి సందర్భంగా అందమైన చెట్టు ఆకులపై పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామానికి చెందిన సీతారాముల చిత్రాలు గీసి ఆకట్టుకుంది. నల్లాల సాయి స్మరణ పిట్లం మహాత్మా జ్యోతి బాపూలే స్కూలో ఎనిమిదవ తరగతి చదువుతుంది. కాళీ సమయంలో మందు గోళీలపై ఇటు చేట్లా ఆకులపై అందమైన చిత్రాలు వేసి అటు పిట్లం మహాత్మా జ్యోతి బాపూలే స్కూల్ లో అబ్బురపరుస్తుంది. బాలిక చదువులో ఇటు కలరంగంలో ప్రకృతి చిత్రాలు వేస్తుంది. దీనికి పూర్తి సహకారం మహాత్మా జ్యోతి బాపూలే ఉపాధ్యాయుల సహకారం తో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉందని సాయి స్మరణ పేర్కొన్నారు. భవిష్యత్తులో మరెన్నో సూక్ష్మస్థాయిలో చిత్రాలను వేస్తానని బాలిక చెప్తుంది.