calender_icon.png 8 April, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

06-04-2025 08:35:36 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంచనూరు గ్రామంలో హనుమాన్ ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణలు, బాజా బజంత్రీలతో రామచంద్రస్వామి కళ్యాణం జరిగింది. కార్యక్రమంలో అధ్యక్షులు పడకంటి రవికుమార్, ఉపాధ్యక్షులు ఆవుసుల బ్రమ్మం, అక్కపల్లి భగవాన్ రెడ్డి, కార్యదర్శి పంతులుగారి నర్సిములు, కోశాధికారి పంతులుగారి సత్యనారాయణ, పందిరి రాంరెడ్డి, వంగళ శ్రీహరి, గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.