calender_icon.png 8 April, 2025 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

06-04-2025 07:13:09 PM

దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణలు, బాజా బజంత్రీలతో రామచంద్రస్వామి కళ్యాణం జరిగింది. ఇందుప్రియాల్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ధర్మకర్త అన్నారెడ్డి సుబాష్‌రెడ్డి దంపతులు స్వామివారి తలంబ్రాలను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొచ్చారు. కళ్యాణోత్సవంలో భాగంగా ఉదయం స్వామివారికి అభిషేకం, ఎదుర్కోళ్ళు నిర్వహించారు.

సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో బాగంగా సోమవారం పొన్నంగి సేవ, మంగళవారం హనుమత్‌సేవ, బుధవారం గరుడ సేవ జరుగుతుంది. గురువారం తెల్లవారు జామున స్వామివారి రథోత్సవం జరుగుతుంది. శుక్రవారం శేషహోమం, పూర్ణాహుతి, శ్రీ పుష్పయాగం, ఉద్వాసనబలులు, సప్తవర్ణ ఏకాంత సేవ, తదితర కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. దౌల్తాబాద్ లో ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్, చేగుంట ఎస్సై చైతన్యకుమార్ లు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అలాగే రాయపోల్, అనాజీపూర్, వడ్డేపల్లి, ఎల్కల్, బేగంపేట, మహ్మద్‌షాపూర్ తదితర గ్రామాలలో శ్రీరామచంద్రస్వామి కళ్యాణం నిర్వహించారు.