calender_icon.png 2 April, 2025 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెట్టింగ్ యాప్స్‌పై సిట్

01-04-2025 12:54:25 AM

  1. చీఫ్‌గా ఐజీ రమేశ్
  2. సభ్యులుగా నలుగురు ఐపీఎస్ అధికారులు 

హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. ఎంత వారు న్నా వదిలేది లేదని చెపుతున్న సర్కారు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసింది.

ఈ మేరకు సోమవారం డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీచేశారు. సిట్ చీఫ్‌గా ఐజీ రమేశ్ నియమితులయ్యారు. సభ్యులుగా ఐపీఎస్ అధికారులు సింధుశర్మ, వెంకటలక్ష్మి, చంద్రకాంత్, శంకర్‌లను  నియమిం చారు. బెట్టింగ్స్ యాప్స్ వ్యవహారంపై రానున్న 90 రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయాలని డీజీపీ జితేందర్ సిట్‌ను ఆదేశించారు.

కేసుల దర్యాప్తునకు అవసరమైన ఇతర అధికారులను సిట్ ఎంపిక చేసుకోనుంది. అందులో ఆర్థిక నిపుణులు, న్యాయ నిపుణులు, ఆడిటర్లు, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను సీఐడీ అదనపు డీజీ అనుమతితో సిట్ నియమించుకునే అవకాశం ఉంది. 

సీఎం సీరియస్

బెట్టింగ్ యాప్స్ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి చాలా సీరియస్‌గా ఉన్నారని అధికారులు తెలిపారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ అంశంపై స్పష్టమైన వైఖరిని వెల్లడించారు. తాము బెట్టింగ్ యాప్స్, ఆన్‌లైన్ రమ్మీ గేమ్స్‌పై కఠినంగా ఉంటామని ప్రకటించారు.