calender_icon.png 24 April, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్ల దుర్మరణం

23-04-2025 11:13:34 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పెగడపల్లి గ్రామంలో ద్విచక్ర వాహనాన్ని ట్రాలీ ఢీకొట్టడంతో అక్కాచెల్లెళ్లు దుర్మరణం పాలైన ఘటన బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగింది. మండలంలోని దుర్గారావు గ్రామానికి చెందిన సొంత అన్నదమ్ముల పిల్లలు మౌనిక, నవ్య ఫ్రెండ్ ఇంట్లో పుట్టినరోజు వేడుకలకు ద్విచక్ర వాహనంపై పొగుళ్లపల్లి వెళుతుండగా పెగడపల్లి గ్రామ సమీపంలో ఆటో ట్రాలీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో మౌనిక, నవ్య అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కొద్దిసేపటి వరకు తమ వద్ద ఉన్న పిల్లలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలుసుకొని తల్లిదండ్రులు బంధువుల రోదనలతో ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు.