లిక్కర్ స్కాం కేసులో జైలుకెళ్లి బెయిల్‌పై వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ జపంపై జనం లో చర్చ మొదలైంది. కవిత బీసీ పోరాటంపై నెటిజన్లు ఓ ఆటాడేసుకుంటున్నారు.గతంలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఉన్న 42 శాతం రిజర్వేషన్‌ను తగ్గించేశారు కదా అని చురకలంటిస్తున్నారు.
బీఆర్‌ఎస్ అధ్యక్ష పదవిలో ఉన్న ఆమె తండ్రి కేసీఆర్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఆ పదవిని పార్టీలో ఉన్న బీసీ నాయకునికి ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నా రు. బీసీల కోసం పోరాటం చేస్తానంటున్న ఎమ్మెల్సీ కవితకు ఓ వైపు మద్దతు లభిస్తున్నా.. మరోవైపు విమర్శలూ ఎదురవుతున్నాయి.
పెద్ది విజయ భాస్కర్