24-02-2025 12:00:00 AM
జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 23: ఆస్తికోసం తోడబుట్టిన తమ్ముణ్ణి అక్కలు అతి కిరాతకంగా కర్రలతో దాడి చేసి హత్య చేసిన సంఘటన ఆదివారం జగిత్యాల పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ వేణుగోపాల్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల పట్టనం పోచమ్మ వాడకు చెందిన జంగిలి శ్రీనివాస్ ఆర్టిఏ ఏజెంట్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
తల్లిదండ్రులు సంపాదించిన ఇల్లు తోపాటు 100 గజాల భూమి ఉండగా ఆ భూమిని, ఇంటిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలంటూ శ్రీనివాస్ పై ముగ్గురు అక్కలు గత కొంతకాలంగా ఒత్తిడి తెస్తున్నారు. ముగ్గురు అక్కలకు గతంలోనే పెళ్లిళ్లు కాగా పెద్ద అక్క భారతపు వరలక్ష్మి భర్త చనిపోగా 20 సంవత్సరాలుగా తల్లిదండ్రి వద్దనే ఉంటుంది. మరో అక్క ఓడ్నాల శారద కుటుంబ కలహాలతో భర్తను వదిలిపెట్టి తల్లిగారి ఇంటి పక్కనే ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది.
పది సంవత్సరాల క్రితం తండ్రి బసవయ్య తన కొడుకు శ్రీనివాస్ పేరు మీద భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని ప్రయత్నించగా అక్క లు తీవ్రంగా వ్యతిరేకించి కోర్టులో కేసు వేశా రు. ఆ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. అక్కలతో తరచూ గొడవలు జరుగుతుండడంతో శ్రీనివాస్ గత కొంత కాలంగా వేరే ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు.
ఆదివారం తన తల్లిదండ్రులను చూడడానికి సొంత ఇంటికి వచ్చాడు. దీంతో ఇద్దరు అక్కలు వరలక్ష్మి, శారద లు శ్రీనివాస్ తో గొడవకు దిగారు. నీ వల్లనే కోర్టు కేసు ఎటు తేలడం లేదని తీవ్ర పదజాలంతో శ్రీనివాస ను దూషిస్తూ కర్రలతో దాడికి దిగారు.
తన అక్కలు అకస్మా త్తుగా తనపై దాడి చేయడంతో శ్రీనివాస్ పారిపోయే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ అతని వెంటపడి కర్రలతో దాడి చేయ డంతో తలకు తీవ్ర గాయాలై శ్రీనివాస్ కుప్ప కూలిపోయాడు. స్థానికులు గమనించి శ్రీనివాసును ఆసుపత్రికి తరలించారు. ఆసుప త్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు. శ్రీనివాస్ భార్య జంగిలి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వేణుగోపాల్ తెలిపారు.