calender_icon.png 27 April, 2025 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీజీపీ చేతుల మీదుగా ప్రశంస పత్రంతో పాటు రివార్డు అందుకున్న ఎస్సైలు

26-04-2025 10:38:31 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్సై జలగం ప్రవీణ్, ఎస్ఐ సుమన్ ఎక్కడికి అక్కడ సమాచారం తెలుసుకొని గంజాయి రవాణాని నిర్మూలించినందు గాను శనివారం డిజిపి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ గంజాయిని జిల్లాలోకి రానివ్వకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ గంజాయిపై ఉక్కు పాదం మోపిన జిల్లా పోలీస్ అధికారులకు హైదరాబాదులో డిజిపి కార్యాలయంలో ప్రశంసా పత్రంతో పాటు రివార్డును అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్సై జలకం ప్రవీణ్ సుమన్లు మాట్లాడుతూ... జిల్లాలో యువత ఎక్కువగా గంజాయికి బానిసవుతుందని గంజాయిని జిల్లాలోకి రానివ్వకుండా అడ్డుకట్ట వేస్తున్నామని ఎప్పటికప్పుడు గంజాయి రవాణా చేస్తున్న వారిని అదుపు తీసుకుని కేసులు నమోదు చేస్తున్నామన్నారు. గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు అవుతాయని యువత గంజాయికి బానిస కాకుండా ఉద్యోగాల వైపు మొగ్గు చూపాలన్నారు. ఎవరైనా గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.