calender_icon.png 27 April, 2025 | 8:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరుల పర్వం.. అక్షయ తృతీయ!

26-04-2025 11:39:59 PM

అక్షయ తృతీయ, ధన త్రయోదశి రోజుల్లో.. పండుగలు, పెళ్లిళ్లు, వ్రతాలు ఇతర శుభకార్యాలకు బంగారాన్ని కొనడం, ధరించడం ఆనవాయితీగా వస్తున్నది. వైశాఖ మాసం శుక్ల పక్షంలో వచ్చే తదియను ‘అక్షయ తృతీయ’ అంటారు. ఈ పండుగ వెనుక పౌరాణిక, చారిత్రక కథనాలు ఎన్నో ఉన్నాయి.

ఈరోజు చేసే దానధర్మాలు, కొనుగోళ్లు అక్షయమైన ఫలితాలను ఇస్తాయని, దైవానుగ్రహం అక్షయంగా పొందే విశేషమైన పర్వం ఇది. ఈ నెల 30న అక్షయ తృతీయ సందర్భంగా సీఎమ్‌ఆర్ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

౩౦న అక్షయ తృతీయ సందర్భంగా..

సీఎమ్‌ఆర్‌లో  మీకు నచ్చిన ఆభరణాలను అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. బుక్ చేసిన రోజు లేదా డెలివరీ తీసుకున్న రోజు రేట్లలో ఏది తక్కువగా ఉంటే ఆ ధరకు కొనుగోలు చేసుకోవచ్చు. తరాలు మారుతున్నా.. బంగారు నగలపై అమ్మాయిలకు మోజు మాత్రం ఎన్నటికీ తరగదు. అందుకే ఈ అక్షయ తృతీయకు అమ్మమ్మ, నానమ్మలు మెచ్చిన నగలు కొనేద్దాం.

ఇతిహాసాలు..

*మెడకి నెక్లెస్‌లా చుట్టుకునే ఈ టెంపుల్ స్టుల్ నగకు దక్షిణ భారతీయ సంప్రదాయ ఆభరాణాల డిజైన్లలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రాచీన భారతీయ చరిత్రకూ ప్రతిబింబంగానూ నిలుస్తున్నది. అడ్డిగ, అద్దిగై, అద్దిగే.. వంటి పేర్లతో ప్రాంతాన్ని బట్టి ఒక్కో పేరుతో పాపులర్ అయింది. కెంపులు, పచ్చలు, తెల్ల రాళ్లతో చేసిన రకాలతో పాటు సాదా బంగారు గొలుసుకు వజ్రాలూ, రత్నాలూ, రాళ్లను పొదిగిన హెవీ పెండెంట్లను జత చేసిన అడ్డిగలూ వస్తున్నాయి. నేటితరం అమ్మాయిల మనసుని దోచుకుంటున్నాయి. 

 *అక్షయ అంటే తరగనిది అని అర్థం. పురాణాల్లో అక్షయపాత్ర గురించి విని ఉంటాం. ఈ పాత్ర కలిగిన వారి ఇంటికి ఎంతమంది అతిథులు వచ్చినా కావాల్సినంత ఆహారాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీమహాలక్ష్మీ అమ్మవారు అన్ని ఐశ్వర్యాలకు అధినేత్రి. ఆమె అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో ఏ లోటు ఉండదు. అందుకనే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ పర్వదినాన పూజలు నిర్వహిస్తారు. 

*వైశాఖ మాసంలో తదియ నాడు వచ్చే పర్వదినాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. త్రేతాయుగం ఈ రోజునే ప్రారంభం కావడంతో ఈ తిథికి అంత విశిష్టత ఏర్పడింది. మహాభారత రచనను విష్నేశ్వరుడి ఆశీస్సులతో వేదవ్యాసుడు ఈ దినానే ప్రారంభించినట్టు పురాణాలు చెబుతున్నాయి. 

*సంపదలకు అధిపతి కుబేరుడు శివున్ని ప్రార్థించగా ఆయన లక్ష్మీ అనుగ్రహాన్ని ఇచ్చినట్టు శివపురాణం తెలుసుతున్నది. మహాభారతంలో ధర్మరాజుకు ఈ రోజున అక్షయపాత్ర ఇవ్వడం, గంగానది ఆ పరమేశ్వరుని జటాజూటం నుంచి భూవిపైకి అవతరించిన పవిత్ర దినం అక్షయ తృతీయ కావడం విశేషం. 

*మన దేశంలో బంగారానికి ఎక్కువ విలువ ఉంది. సంపద ఉంటే మనం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండగలం. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం సంపద ఉంటుందన్న నమ్మకంతో బంగారాన్ని కొనుగోలు చేస్తారు. పరశురాముడిగా శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించిన దినమిది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నందునే అక్షయతృతీయ ను ఘనంగా జరుపుకుంటాం.