సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. శుక్రవారం కాగజ్ నగర్ పట్టణంలోని త్రిశూల్ పహాడ్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా 128 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కళ్యాణలక్ష్మి ,షాదీ ముభారక్ దరఖాస్తులు పెండింగ్ లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ పనిచేస్తానన్నారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కిరణ్, మున్సిపల్ చైర్మన్ షాహిన్ సుల్తానా, కౌన్సిలర్లు, భాజపా జిల్లా కోశాధికారి అరుణ్ లోయ, జిల్లా కార్యదర్శి రాజేందర్ గౌడ్, సంజీవ్, మల్లేష్, చప్పిడి సంజీవ్, శ్రీనివాస్, అశోక్, రాజు, సుమన్, తిరుపతి, రాజు, రవీందర్, కోట వేణు తదితరులు పాల్గొన్నారు.