26-02-2025 11:32:43 AM
కాగజ్ నగర్, (విజయక్రాంతి): మహా శివరాత్రి(Maha Shivratri) పర్వదినాన్ని పురస్కరించుకుని కాగజ్ నగర్ మండలం ఈస్గాం శివ మల్లన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు(Sirpur MLA Palvai Harish Babu), కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రావి శ్రీనివాస్ నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు స్వామి వారిని దర్శించుకుని రుద్రాభిషేకం చేశారు. సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు శివానుగ్రహం కలగాలని కోరుకున్నట్లు తెలిపారు.