calender_icon.png 10 January, 2025 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిర్పూర్ @ 5.2 డిగ్రీలు

10-01-2025 12:39:14 AM

 క్షీణిస్తున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): తెలంగాణలో చలి విజృంభిస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్‌లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గురువారం అసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 5.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాష్ట్రంలో 14 జిల్లాల్లో పది డిగ్రీలకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండీ పేర్కొంది. అలాగే, శుక్రవారం చలి తీవ్రత ఉన్న నాలుగు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీగా చలిగాలుల వీచే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.