- గతేడాది ఇదే రోజున 17.9 డిగ్రీలు నమోదు
- ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిలాల్లో భారీగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భయ పెడుతున్నాయి. రాష్ట్రంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదువుతున్న జిల్లాల్లో ఉ మ్మడి ఆదిలాబాద్, మెదక్ ముందు వరుస లో ఉన్నాయి. కుమ్రం భీం అసిఫాబాద్ జి ల్లాలోని సిర్పూల్‌లో సోమవారం కనిష్ఠ ఉ ష్ణోగ్రత 8.3 డిగ్రీలుగా నమోదైంది.
గతేడాది ఇదే రోజున 17.9 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. రెండోస్థానంలో సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ ఉంది. ఇక్కడ 8.8 డిగ్రీలుగా నమోదైంది. గతేడాది ఇదేరోజున 19.5 డిగ్రీ లు రిజిస్టర్ కావడం గమనార్హం. మూడోస్థానంలో ఆదిలాబాద్‌లోని బేల గ్రామం ఉం ది. ఇక్కడ సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11.6 డిగ్రీలు కాగా.. 9.9 డిగ్రీలు నమోదయ్యాయి.
నాలుగో స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ని రుద్రంగి (10.3 డిగ్రీలు), 10.5 డిగ్రీలతో వికారాబాద్‌లోని మారపల్లి ఐదో స్థానంలో ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతల విషయంలో రాష్ట్రం మొత్తం ఇదే ట్రెండ్ నడుస్తోంది. గతేడాది కంటే భారీగా పతనవుతున్న పరిస్థితి నెలకొంది.
ఐదు ప్రాంతాలకు అలర్ట్ జారీ..
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత లు వేగంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యం లో ఆదిలాబాద్, మెదక్, హనుమకొండ, రా జేంద్రనగర్, పటాన్‌చెరు ప్రాంతాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అలర్ట్‌గా ఉండాలనే ఈ హెచ్చరికలు జారీ చేశామని, ఇవి ప్రమాద సూచికలు కాదని అధికారులు వెల్లడించారు.