26-04-2025 08:23:19 PM
మోతే: మండల పరిధిలోని సిరికొండ గ్రామానికి చెందిన కట్టేబోయిన శ్రీను కూతురు కల్యాణి వారం క్రితం వెలువడిన ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసి 500 మార్కులకు గాను 483 మార్కులు సాధించింది. ఉత్తమ ఫలితాలు సాధించడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ కళాశాల విద్యార్థిని కల్యాణి మంచి మార్కులు సాధించడంతో హైదరాబాదులోని మహాత్మాగాంధీ రెసిడెన్షియల్ కళాశాల బృందం శుభాకాంక్షలు తెలియజేశారు.