మహేశ్వరం,(విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గం(Maheshwaram Constituency) శరవేగంగా అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి(Former MLA Kichannagari Lakshma Reddy) అన్నారు. శనివారం మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామం నుంచి బీజేపీ(BJP) నాయకులు పెద్దసంఖ్యలో కాంగ్రెస్(Congress)లో చేరారు. వీరందరికీ మూడురంగుల కండువాలు కప్పి పార్టీలోకి కేఎల్ఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి మాట్లాడుతూ... కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నాలుగో పట్టణంగా అభివృద్ధి చెందుతున్న మహేశ్వరం నియోజకవర్గంలోని అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేలా ప్రపంచ స్థాయి అగ్రశేణి విద్యాసంస్థలను తెస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైతం ఫోర్త్ సిటీ సహా నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నారని కిచ్చెన్నగారు చెప్పారు. ఇల్లు, రేషన్ కార్డులను అర్హులకు అందేలా కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని లక్ష్మారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరసింహాగౌడ్, జి.శ్రీను, కొమరయ్య సహా కొత్తగా పార్టీలో చేరారు.