27-04-2025 10:22:14 PM
కామారెడ్డి టౌన్ (విజయక్రాంతి): 2024-2025 విద్యా సంవత్సరంలో ఫిజియోథెరపీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన శ్రీ ఆర్యభట్ట జూనియర్ ఒకేషనల్ కళాశాల విద్యార్థినులు సిరిగాధ ప్రవళిక, తన్సిమ్ ఫాతిమా 469/500 మార్కులతో ఫిజియోథెరపీ కోర్సులో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు అదే కళాశాలకు చెందిన దోమకొండ విద్యార్థిని సిరిగాధ ప్రవళిక 456/500 మార్కులతో ఫిజియోథెరపీ కోర్సులో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి ప్రభంజనం సృష్టించారు.
మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ విభాగంలో బి మమత, సాత్విక్ గౌడ్, ఎలక్ట్రిషన్ విభాగంలో శ్యామల్, సిహెచ్ రేవంత్, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ విభాగంలో సానియాజ్, కల్పన్, రిమీషా ఫాతిమా రాష్ట్రస్థాయిలో మొదటి 10 ర్యాంకులలో దాదాపు 5 ర్యాంకులు శ్రీ ఆర్యభట్ట ఒకేషనర్ ఒకేషనల్ కళాశాల విద్యార్థులు ఊహించని ప్రభంజనాన్ని సృష్టించారని కళాశాల యజమాన్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కేశరెడ్డి గురువేందర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు, కళాశాల డైరెక్టర్ సత్యనారాయణ, కళాశాల అధ్యాపక బృందం జావిద్, సయ్యద్, బాబర్, విష్ణు, శ్రీనివాస్ పాల్గొన్నారు.