calender_icon.png 18 January, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరినోము ముప్ఫు పాటల మాల సిరిధరా మీకు!

14-01-2025 12:00:00 AM

“మీరు కోరిన అంతరంగ కైంకర్యాన్ని నేను స్వీకరిస్తాను. మీరు పొందిన ఈ మహాభాగ్యం ఇతరులు పొందాలని మీకు ఉందా? దానికి మార్గం ఏమిటి” అని శ్రీకృష్ణుడు అంటే “మేం పాడి మిమ్ము సాధించిన ఈ గోదా గీతాన్ని పాడుతూ సిరినోము చేసిన వారికి శ్రీమన్నారాయణానుగ్రహం కలిగి రేపల్లెలో గోపికలవలె, శ్రీవిల్లిపుత్తూరులో మావ లె ఆనందసాగరంలో ఓలలాడుతారు” అని గోపికలు అంటారు.

ఆ అనుగ్రహమే ఈ గోదా పాశురాలు, ఆ అనుగ్రహం కోసమే గోదా గీత గోవిందం. కార్యకర్తలు, విన్నవారు, అన్ని రకాల ప్రయత్నాలు చేసిన వారందరికీ తండ్రి అనుగ్రహమే, అదంతా అమ్మ ఆణ్డాళ్ అనురాగమే. క కార వాచ్యుడైన బ్రహ్మకు ఈశుడైన శివునకు కారణం కేశవుడని శాస్త్రం. సౌలభ్య సౌశీల్య వాత్సల్య స్వామిత్వ గుణాలు నిండినవాడు అని నారాయణ శబ్దార్థం.

ఓడలున్న పాలకడలి(వఙ్గక్కడల్), దేవతలకోసం చిలికిన(కడన్ద), లక్ష్మీపతిని(మాదవనై), శ్రీకృష్ణుని(కేశవనై), చందమామవంటి అందమైన ముఖాన్ని(తిఙ్గళ్ తిరుముగత్తు), సుందరా భరణాలు ధరించిన గోపికలు(శేయిజైయార్), చేరి(శెన్ఱు), నమస్కరించి(ఇఱైంజి), ఆ రేపల్లెలో(అఙ్గప్), ప్రసిద్ధమైన(పఱైకొణ్డ వాట్రై), పురుషా ర్థాన్ని పొందిన వృత్తాంతాన్ని(తమ), అందమైన శ్రీవిల్లిపుత్తూరులో(అణి పుదువై),

బంగారు కాంతులీనుతున్న తామరపూవులతో చేసిన అందమైన మాలలు గలిగిన పెరియాళ్వారుల కుమార్తె గోదాదేవి(పైఙ్గమలత్ తణ్తెరియల్ బట్టర్పిరాన్ కోదై) చెప్పిన (శొన్న) ఆపాత మధురమైన మ్పు తమిళ గీతాల మాల (శఙ్గత్తమిత్తమిర్ మాలై ముప్పదుం), తప్పనిసరిగా (తప్పామే), ఈ భూమిలో(ఎఙ్గుమ్), ఈ విధంగా(ఇప్పరిశు), అనుసంధానం చేసేవారు (ఉరైప్పార్), కొండంత భుజాలు నాలుగు కలిగినవాడు(ఈరిరణ్డు మాల్ వరైత్తోళ్), ఎరుపైన అందమైన ముఖం కలిగిన వాడును(శెంఙ్కణ్ తిరుముగత్తు), ఐశ్వర్య(చెల్వమ్), శ్రీమంతుడైన శ్రీమన్నారాయణునితో(త్తిరుమాలాల్), అన్నిచోట్ల(ఎఙ్గుమ్), అతని కరుణా కటాక్షాలను పొంది(తిరువరుళ్ పెట్రు),ఆనంద మగ్నులవుతారు(ఇన్భుఱువర్).

అది కల్లోలపు కడలి. అలలు కదలిస్తున్నాయి. ఓడలు కదులుతున్నాయి. క్షీరసాగరాన్ని మథిస్తున్నారు. ఆ మందర పర్వతం ఓవైపు ఒరిగిపోతుం ది. మాధవుణ్ణి కేశవుణ్ణి పడిపోకుండా చూస్తున్నారు. మాధవుడు అంటే హరి తన లక్ష్మీదేవిని కేశవుడు మళ్లీ రప్పించుకుంటున్నాడు. జాబిలివలె భక్తి అనే ఆభరణాలతో అలంకరించుకుని అనుగ్రహాన్ని ఆ పాశురంలో పొందించుకుంటామని ఆశిస్తున్నారు. ఆ శ్రీవిల్లిపుత్తూరు ఒక రమ్య మైన ఊరు.

కమలాలవంటి అందమైన చేతుల తో మాలలను, కమలాలవంటి చల్లని మాలల ను అల్లుతున్నారు. ఆమె కోదై. తప్పెటని అడగ డం లేదు. ఆ పేరుతో అనుగ్రహాన్ని కోరుకుంటున్నారు. ధనుర్మాసంలో ఆణ్డాళ్ పాటలతో, కోయిలతో తీయని పాటలు పాడుకుంటుంది. గోపకన్నియలు తీయగా పిలుచుకుంటున్నాయి. పాశురాలు రోజుకొకటి పాటలు అల్లుతున్నాయి. నాలుగు భుజాలతో కొండలవంటి అండదండాలతో, కండలతో రక్షించుకుం టున్నాడు.

జీరపు కన్నులతో మోహనుడు అం దంగా ఆనందంగా ఉన్నాడు. 30 పాశురాలు చివరకు ఆణ్డాళ్ ఏం కావాలో చెబుతున్నది. కృష్ణుడే మేఘాలమో ము. వాడి నీలాల మోహనుని నవ్వు చూపులే అవన్నీ ఐశ్వర్యములే అంటున్నారు. సముద్రం చిలికితే ఒక చంద్రుడే ఉదయిస్తే గోపికలు అయిదు లక్షల చంద్రుల వలె భాసిస్తున్నారు. ఈ పాశురం మాదవన్‌తో మొదలై తిరుమాల్‌తో ముగియడం ద్వయంలోని రెండు పాదా ల అర్థాన్ని సూచిస్తున్నాయని పెద్దలు వ్యాఖ్యానించారు.

నెల రోజులు ధనుర్మాస వ్రతం ఆచ రించిన గోదాదేవి, తన ఊరును రేపల్లెగా భా వించి తనను తాను ఒక గోపికగా సంభావించి శ్రీరంగంలో వేంచేసి ఉన్న శ్రీరంగనాథుణ్ణి ప్రేమించి, అతనినే ధ్యానించి, గీతించి, ఆతనినే వివాహమాడాలని అత్యంత దృఢ సంకల్పంతో అతణ్ణి బలవంతంగా భర్తను చేసుకుంది. ఫలితంగా శ్రీవిల్లిపుత్తూర్ నుంచి గోదాదేవిని పల్లకిలో రప్పించుకొని శ్రీరంగనాథుడు విగ్రహ స్వరూపంతోనే వివాహమాడాడని చరిత్ర.