- - 4.24 కోట్ల మీటర్ల ఆర్డర్లు అందజేత
- ఇందిరా మహిళా శక్తి చీరల పథకం (యూనిఫాం), చీరల ఆర్డర్స్ అందజేత
- టెస్కో జీఎం అశోక్‌రావు
సిరిసిల్ల, జనవరి 20( విజయ క్రాంతి ): ప్రపంచ మార్కెట్తో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పోటీపడాలని, ఆ దిశగా ప్రభుత్వం వస్త్ర ప రిశ్రమ అభివద్ధికి అన్ని చర్యలు తీసుకుం టున్నదని టెస్కో జీఎం అశోక్ రావు తెలిపా రు. రాష్ర్ట ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు అందించే యూనిఫామ్ చీరల ఆర్డర్లు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అందజే శారు.
సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ సమీకత కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టెస్కో జీఎం అశోక్ రావు మాట్లాడారు. ఇందిరా మహిళా శక్తి చీరల పథకంలో భాగంగా ముందుగా ఒక చీరను ( అందరికీ ఒకే రంగు చీర) ఆర్డర్స్ దాదాపు 4.24 కోట్ల మీటర్లు అందజేయడం జరిగిందన్నారు. ఈ చీరలను ఈ ఏప్రిల్ 30 వ తేదీలోగా సిద్ధం చేయాలని సూచించారు.
ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వం రూ. 50 కోట్లతో యార్న్ బ్యాంక్ ఏర్పాటు ప్రభుత్వం చేసిం దన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మార్కెట్ తో పోటీపడి స్వయం సమద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆర్డర్స్ తయారు చేసేలా యంత్రాలు ఆధునీకరించా లన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబం ధించిన రూ. 500 కోట్ల బకాయిలను ప్రభు త్వం విడుదల చేసిందన్నారు.
ఆధునిక, నా ణ్యమైన ఉత్పత్తులు తయారు చేసేలా సిద్ధం కావాలని పేర్కొన్నారు. ఇప్పటికే స్కూల్ యూనిఫాం మరమగ్గాల సంఘాలకు 65.67 లక్షల మీటర్లు ఆర్డర్స్ ఇచ్చామని, ఆర్డర్స్ అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ సెక్రటరీకి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బాధ్యులు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో హ్యాండ్ లూమ్ అండ్ టెక్సై్టల్స్ ఏడీ సాగర్, టెస్కో ఏడీ సందీప్ జోషి,తదితరులు పాల్గొన్నారు.