calender_icon.png 23 November, 2024 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరిసిల్ల డీఈవో బదిలీ

23-11-2024 12:00:00 AM

అవినీతి ఆరోపణలే కారణమా?

సిరిసిల్ల, నవంబర్ 22 (విజయ క్రాంతి): సిరిసిల్ల డీఈవో రమేష్‌కుమార్ నాగర్‌కర్నూల్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల జిల్లా విద్యాధికారిగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ఇక్కడికి బదిలీపై రానున్నా రు. అయితే కొద్ది కాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రమేష్‌కుమార్‌పై బదిలీ వేటు పడటంతో ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

రిటైర్డ్ ఉపాధ్యా యుల సమస్యలు పరిష్కరించకుండా వేధించేవాడని, ప్రైవేట్ పాఠ శాలల వద్ద మమూళ్లు వసూల్ చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి. బదిలీకి ఇదే కారణమని ఉపాధ్యా య వర్గాల్లో చర్చ నడుస్తున్నది.