న్యూయార్క్: పొట్టి ప్రపంచకప్‌లో బంతితో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న భారత పేసర్ మహమ్మద్ సిరాజ్.. ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొడుతున్నాడు. అమెరికాతో జరిగిన పోరులో బౌండ్రీ సమీపంలో అసాధ్యమనిపించిన క్యాచ్‌ను అలవోకగా అందుకున్న సిరాజ్.. ‘బెస్ట్ ఫీల్డర్’ అవార్డు అందుకున్నాడు. నిరుడు స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఆటగాళ్లలో స్ఫూర్తి నింపేందుకు భారత ఫీల్డింగ్ కోచ్.. ఈ ‘బెస్ట్ ఫీల్డర్’ అవార్డు సంప్రదాయాన్ని ప్రారంభించగా.. టీ20 వరల్డ్‌కప్‌లోనూ దీన్ని కొనసాగిస్తున్నారు. అమెరికాతో మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు అందుకోవడంతో పాటు ఒక రనౌట్‌లో భాగస్వామి అయిన సిరాజ్‌కు.. భారత మాజీ ఆల్‌రౌండర్, వరల్డ్‌కప్ అంబాసిడర్ యువరాజ్ సింగ్ ఈ పురస్కారం అందించడం కొసమెరుపు.