మహబూబ్ నగర్, జనవరి 31 (విజయ క్రాంతి) : అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్ళేందుకు అంబులెన్స్ అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధు సూదన్ రెడ్డి ని కలిసి పలువురు నాయకులు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు.
స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో చర్చలు జరిపి సిసి కుంట మండల కేంద్రానికి ప్రత్యేకంగా అంబు లెన్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. దీంతో సిసి కుంట మండల వాసులు ఎమ్మెల్యే కు కతజ్ఞతలు తెలిపారు.