calender_icon.png 18 November, 2024 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిప్ పెట్టుబడులు సరికొత్త రికార్డ్

12-11-2024 12:00:00 AM

అక్టోబర్‌లో తొలిసారి రూ.25 వేల కోట్లు

ముంబై: దేశంలో క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (సిప్) పెట్టుబడులు కొత్త రికార్డు నెలకొల్పాయి. సిప్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు తొలిసారి రూ. 25వేల కోట్ల మార్కును దాటాయి. అక్టోబర్ నెలలో మొత్తం రూ.25,323 కోట్లు మదుపర్లు పెట్టుబడిగా పెట్టా రు. సెప్టెంబర్ నెలలో ఈ మొత్తం రూ.24,509 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే సమయంలో ఈ మొత్తం రూ.16,928 కోట్లుగా ఉందని మ్యూచువల్ ఫండ్ సంస్థల సంఘం (యాంఫీ) వెల్లడించింది.

కొత్త సిప్ రిజిస్ట్రేషన్ల సంఖ్య 63.7 లక్షలుగా నమోదయ్యాయి. దీంతో మొత్తం సిప్ అకౌంట్లు 10.12 కోట్లకు పెరిగాయి. సిప్ కింద నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ ఏయూఎం 13.30 క్షల కోట్లకు చేరింది. ఈక్విటీ మార్కెట్లైన సెన్సెక్స్, నిఫ్టీ అక్టోబర్ నెలలో 5-6 శాతం మేర పడిన నేపథ్యంలో సిప్ పెట్టుబడులు పెరగడం గమనార్హం.