calender_icon.png 16 January, 2025 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటికింది సొరంగంలోనే సిన్వర్

21-10-2024 12:00:00 AM

  1. కుటుంబంతో కలిసి ఇన్నాళ్లు అక్కడే 
  2. సిన్వర్ భార్య హ్యాండ్ బ్యాగ్ ధర 26 లక్షలు

జెరూసలెం, అక్టోబర్ 20: ఇటీవల మర ణించిన హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్ ఇన్నా ళ్లు తన ఇంటి కింద ఏర్పాటు చేసుకున్న సొర ంగంలోనే దాక్కున్నాడని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. సొరంగంలోకి తన కుటుంబ సభ్యులతో ఉండి ప్రాణాలు కాపాడుకున్నా డని ఐడీఎఫ్ పేర్కొంది. సిన్వర్ మరణం తరువాత లభించిన వీడియోను సైన్యం విడు దల చేసింది.

ఈ వీడియోలో 2023 అక్టోబర్ 6న సొరంగంలోకి తన భార్య, పిల్లల తో కలిసి వెళుతున్నాడని పేర్కొంది. అక్కడి నుంచే సూచనలు చేస్తూ అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేయించాడని, తర్వాత బయటకు వచ్చి మారువేషంలో తిరుగుతున్నాడని పేర్కొంది.

సొరంగంలో జరిపిన సోదాల్లో లభించిన ఇజ్రాయెల్ క్యాష్, వివిధ పత్రాలను విలేకరుల కు చూపెట్టారు. ఉగ్రవాది సిన్వర్ భార్య అత్యంత రూ.౨౬ లక్షల ఖరీదైన హ్యాండ్ బ్యాగును వాడుతున్నట్లు తెలిపింది. 

గాజాపై దాడిలో 87 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం జరిపిన భీకర దాడిలో 87 మంది మరణించారు. 40 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు.