calender_icon.png 9 March, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీపాద కాలనీలో సింటెక్స్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి నీటి ఎద్దడిని నివారించాలి

07-03-2025 02:31:35 PM

మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్ కు డిగంబర్ వినతిపత్రం

మంథని, విజయక్రాంతి: మంథని పట్టణంలోని శ్రీపాద కాలనీలో గత కొద్దిరోజులుగా మిషన్ భగీరథ మంచినీళ్లు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని,  ప్రజలకు సింటెక్స్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి నీటి ఎద్దడిని నివారించాలని శుక్రవారం విద్యార్థి నాయకుడు డిగంబర్ మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్పందించిన మున్సిపల్ కమిషనర్  త్వరలోనే వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి తాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారని డిగంబర్ తెలిపారు.