calender_icon.png 19 January, 2025 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిన్నర్ విన్నర్

10-09-2024 03:16:51 AM

  1. ఫైనల్లో టేలర్ ఫ్రిట్జ్‌పై విజయం 
  2. తొలిసారి యూఎస్ ఓపెన్ కైవసం

ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ విజేతగా ప్రపంచ నంబర్‌వన్ జానిక్ సిన్నర్ నిలిచాడు. జొకోవిచ్, అల్కారాజ్ లాంటి టాప్ సీడ్ ప్లేయర్లు ఓటమితో ముందే నిష్క్రమించడంతో సిన్నర్‌కు ఎదురులేకుండా పోయింది. యూఎస్ ఓపెన్ ముందు డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ ఒత్తిడిని దరిచేరనీయని సిన్నర్ చాంపియన్‌గా నిలిచాడు. ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్ కైవసం చేసుకున్న సిన్నర్.. ఈ ఏడాది యూఎస్ ఓపెన్ రూపంలో రెండో టైటిల్ ఖాతాలో వేసుకొని మరో భవిష్యత్తు స్టార్‌గా వెలుగొందుతున్నాడు. తొలిసారి టైటిల్ గెలవాలన్న అమెరికా స్టార్ టేలర్ ఫ్రిట్జ్‌కు నిరాశే ఎదురైంది. 

న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ టైటిల్‌ను ఇటలీ యువ కెరటం జానిక్ సిన్నర్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ సిన్నర్ 6 6 7 తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై సునాయాస విజయాన్ని నమోదు చేసుకున్నాడు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన మ్యా చ్‌లో సిన్నర్ తన ప్రత్యర్థిపై నంబర్‌వన్ ఆట ను ప్రదర్శించాడు. తొలి రెండు సెట్లను సు నాయాసంగా నెగ్గిన సిన్నర్ మూడో సెట్‌లో మాత్రం కాస్త కష్టపడాల్సి వచ్చింది. అయితే సిన్నర్ అనుభవం ముందు తేలిపోయిన టేలర్ పోరాడినప్పటికీ నిర్ణయాత్మక మూడో సెట్‌లోనూ ఓటమి పాలవ్వడంతో సిన్నర్ మ్యాచ్‌తో పాటు టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

మ్యాచ్‌లో టేలర్ 10 ఏస్‌లు, 29 వి న్నర్లు సంధించినప్పటికీ 34 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ఇక ఆ రు ఏస్‌లు కొట్టిన సిన్నర్ 23 విన్నర్లు సంధించాడు. కాగా సిన్నర్‌కు ఇది రెండో గ్రాండ్ స్లా మ్ టైటిల్. ఇంతకముందు ఇదే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను దక్కించుకు న్న సిన్నర్ ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లో సెమీస్‌కు పరిమితమయ్యాడు. ఇక టైటిల్ ఫేవ రెట్స్‌గా బరిలోకి దిగిన జొకోవిచ్, అల్కారా జ్, మెద్వెదెవ్, జ్వెరెవ్ లాంటి స్టార్ ఆటగాళ్లు క్వార్టర్స్, సెమీస్‌కు పరిమితం కావడం కూ డా సిన్నర్‌కు కలిసి వచ్చింది. ఈ ఏడాది అ త్యుత్తమ ఫామ్ కనబరిచిన సిన్నర్ ఈ ఏడా ది నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ కనీ సం సెమీఫైనల్ చేరి నంబర్‌వన్ ర్యాం కును నిలబెట్టుకున్నాడు.మహిళల డబుల్స్ టైటిల్‌ను జెలెనా ఒస్టాపెంకొ (లాత్వియా)  నొక్ (ఉక్రెయిన్) జోడీ సొంతం చేసుకుంది.