calender_icon.png 18 January, 2025 | 1:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిన్నర్ అయ్యేనా విన్నర్?

02-09-2024 01:34:33 AM

మూడో రౌండ్ నెగ్గిన సిన్సినాటి చాంపియన్ 

ఇప్పటికే అల్కారాజ్, జొకోవిచ్ ఇంటికి

స్వియాటెక్ కూడా ముందంజ

యూఎస్ ఓపెన్

యూఎస్ ఓపెన్ రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. టాప్ సీడ్లు అల్కారాజ్, జొకోవిచ్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఈ సారి కొత్త చాంపియన్ అవతరిస్తాడనే ఆశలు అందరిలో చిగురిస్తున్నాయి. సిన్సినాటి ఓపెన్ గెలిచి మాంచి ఊపు మీదున్న సిన్నర్ ఈ దఫా ట్రోఫీని ముద్దాడతాడని అంతా చర్చించుకుంటున్నారు. అందుకు తగ్గట్లే సిన్నర్ కూడా ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ ప్రీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. ఇంకా 4 మ్యాచ్‌లు నెగ్గితే యూఎస్ ఓపెన్ టైటిల్ సిన్నర్ వశం అవుతుంది. 

న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్ స్లామ్ అయిన యూఎస్ ఓపెన్ అనేక మలుపులు తిరుగుతోంది. టైటిల్ ఫేవరేట్లుగా బరిలోకి దిగిన టాప్ సీడ్స్ అల్కారాజ్, జొకోవిచ్ ఇప్పటికే ఇంటి దారి పట్టారు. దీంతో ఈ సారి యూఎస్ ఓపెన్‌కు కొత్త చాంపియన్ వస్తాడా? అని అంతా ఎదురుచూస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు యూఎస్ ఓపెన్ గెలవని 23 సంవత్సరాల ఇటాలియన్ టెన్నిస్ సంచలనం సిన్నర్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ దక్కించుకుంటాడా? అని అంతా చర్చించుకుంటున్నారు. 

సిన్నర్ నంబర్ వన్ విన్నర్

ఇటలీకి చెందిన సిన్నర్ ఇప్పటి వరకు యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ గెలవలేదు కానీ మొన్నటికి మొన్న జరిగిన సిన్సినాటి ట్రోఫీని సిన్నర్ ముద్దాడాడు. అంతే కాకుం డా ప్రస్తుతం సిన్నర్ పురుషుల విభాగంలో తొలి స్థానంలో ఉన్నాడు. దీంతో యూఎస్ ఓపెన్ ప్రారంభానికి ముందు కూడా సిన్నర్ మీద అందరికీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్లే సిన్నర్ తన ప్రత్యర్థులకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ ప్రీ క్వార్టర్స్‌కు ఎంటర్ అయ్యాడు. ఇదే జోరుతో ఆడితే మాత్రం సిన్నర్‌కు ఎదురు ఉండదని అంతా కామెంట్ చేస్తున్నారు. 

సునాయస విజయం

సిన్నర్ మూడో రౌండ్‌లో సునాయస విజయం సాధించాడు. సిన్నర్ (ఇటలీ) 6-1, 6-4, 6-2 తేడాతో కాన్నెల్ (ఆస్ట్రేలియా) మీద విజయఢంకా మోగించాడు. ఈ మ్యా చ్‌లో సిన్నర్ 15 ఏస్‌లు సంధించడం గమనార్హం. 24 అనవసర తప్పిదాలు చేసి కాన్నె ల్ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ గెలుపుతో సిన్నర్ ప్రిక్వార్టర్స్‌లోకి ఎంటర్ అ య్యాడు. ఈ మ్యాచ్ మొత్తం మీద సిన్నర్ 46 విన్నర్‌లు సంధించాడు. ఐదో సీడ్ మెద్వెదేవ్ (రష్యా) 6-3, 6-4, 6-3 తేడాతో కోబోల్లి (ఇటలీ) మీద విజయం సాధించాడు.  మినౌర్ (ఆస్ట్రేలియా) 6-3, 6-7 (4/7), 6-0, 6-0 తేడాతో ఎవాన్స్ (యునైటెడ్ కింగ్‌డమ్) విజయం సాధించాడు. 

స్వియాటెక్‌ది అదే జోరు

మహిళల నంబర్ వన్ సీడ్ స్వియాటెక్ (పోలండ్) 6-4, 6-2 తేడాతో ప్లావుచెంకోవా (రష్యా) మీద గెలిచింది. గులా (అమెరికా) 6-3, 6-3 తేడాతో మానెయిరో (స్పెయిన్) మీద విజయం సాధించింది.  పవోలిని (ఇటలీ) 6-3, 6-4 తేడాతో పుతింట్‌సేవ (కజకిస్తాన్) మీద విజయదుందుభి మోగించింది. 

నేడే బోపన్న ప్రిక్వార్టర్స్ మ్యాచ్

న్యూయార్క్: భారత టెన్నిస్ సంచలనం రోహన్ బోపన్న యూఎస్ ఓపెన్‌లో దుమ్ములేపుతున్నాడు.

బోపన్నఎంబ్డెన్ జోడీ  నేడు ప్రిక్వార్టర్స్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో మోల్తెని-గొనాజ్‌లెజ్ జోడీతో బోపన్న జోడీ తలపడనుంది. 

మిక్స్‌డ్ డబుల్స్‌లో క్వార్టర్స్‌లోకి

యూఎస్ ఓపెన్‌లో రోహన్ బోపన్న జోడీ మిక్స్‌డ్ డబుల్ పోటీల్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. రోహన్ బోపన్న-సుతిజాతి జోడీ నాలుగో సీడ్ అయిన క్రెజికోవా-ఎబ్డెన్ జోడీతో క్వార్టర్స్‌లో తలపడనుంది. ఎబ్డెన్ పురుషుల డబుల్స్‌లో బోపన్నతో కలిసి ఆడడం గమనార్హం. మిక్స్‌డ్ డబుల్స్ పోటీల్లో మాత్రం బోపన్నకు వ్యతిరేకంగా అతడు మరొకరితో ఆడుతున్నాడు.

గత నాలుగు సంవత్సరాలుగా సిన్నర్ 

సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ వింబుల్డన్ యూఎస్ ఓపెన్

2024 గెలుపు సెమీస్ క్వార్టర్స్ -

2023 నాలుగో రౌండ్ రెండో రౌండ్ సెమీస్ నాలుగో రౌండ్

2022 క్వార్టర్ ఫైనల్ నాలుగో రౌండ్ క్వార్టర్స్ క్వార్టర్స్

2021 తొలి రౌండ్ నాలుగో రౌండ్ తొలి రౌండ్ నాలుగో రౌండ్