‘వద్దురా...సోదరా...అరె పెళ్లంటే నూరేళ్లమంటరా’ అంటూ బ్యాచిలర్ లైఫ్‌కు చాలామంది జై కొడుతుంటే.. పెళ్లంటే జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం మాత్రమే కాదు, జీవితాన్ని ఎన్నుకోవడం అని నిర్వచిస్తున్నారు మరికొందరు. అయితే ఒంటరి జీవితం మంచిదా? మ్యారేజ్ లైఫ్ బెటరా? అంటే మోడ్రన్ బ్రహ్మచారులు ఏం చెబుతున్నారో తెలుసా..
హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల ఓ ఐటీ ప్రొఫెషనల్ ఒంటరిగా జీవిస్తున్నాడు. ఇటీవల ప్రమోషన్‌లో భాగంగా అబుదాబికి మారాడు. ఒంటరిగా ఉండే తన సమయాన్ని, ఆసక్తులను వ్యక్తిగత లక్ష్యాల కోసం కేటాయించాడు. దాంతో 30 ఏళ్లలోనే లక్షల ప్యాకేజీతో మంచి ఉద్యోగం సాధించాడు. ఇదంతా ఒంటరిగా ఉండటం వల్లే సాధ్యమైందంటున్నాడు.
“ఒంటరితనం చాలా మంచిది. మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి, తగినంత సమయం దొరుకుతుంది. అయితే ఆ సమయాన్ని జీవిత గమనాన్ని మార్చేస్తుంది. ఒంటరిగా ఉండటం వల్ల జీవిత లక్ష్యాలపై దృష్టి పెడుతున్నాం. వృత్తిపరమైన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నాం” అని అంటోది ఈతరం.
లక్ష్యాలకు పెళ్లి అడ్డంకి..
పెళ్లి చేసుకున్నవారు ఎంచుకున్న రంగంలో రాణించలేరు. ఒంటరి ఉండటం వల్ల ప్రపంచాన్ని అన్వేషించడం, ఆర్థికంగా స్థిరపడటం లాంటి ఎన్నో లాభాలుంటాయి. అందుకే వీ ఆర్ సింగిల్స్ అని చెబుతున్నారు ఈకాలం కుర్రాళ్లు. సింగిల్‌గా ఉండేవారికి ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారికోసం తమ ఇష్టాలు వదులుకోవాల్సిన అవసరం రాదు. వ్యక్తిగత ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి పెడతారు. తమకు నచ్చిన ప్రదేశాలకు వెళ్లేందుకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు.
ఆర్థికంగా ఫ్రీడమ్ ఉంటుంది. ఎవరి కోసం ఎలాంటి ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు. ఏ సమయంలోనైనా.. ఎక్కడికైనా.. ఎలా అయినా వెళ్లొచ్చు. తమకోసం తప్పా.. ఇతరులకోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ప్రొఫెషనల్ గోల్స్‌ని రీచ్ అవ్వడానికి ఎలాంటి అటంకాలు ఉండవు. సమస్యలను ఒంటరిగా ఎదుర్కోవడం నేర్చుకుంటారు. నచ్చిన పనులు చేసుకుంటారు. హాబీలను వదులుకోవాల్సిన అవసరం ఉండదు. రిలేషన్‌షిప్‌లో ఉండే సమస్యలు, చిరాకులు ఉండవు. నచ్చిన విషయాల్లో రాజీ పడాల్సిన అవసరం ఉండదు. సెల్ఫ్ లవ్‌కి ప్రాధాన్యత ఇవ్వొచ్చు. మీ వర్త్ మీకు బాగా తెలుస్తుంది.
కొన్ని నష్టాలు..
కొన్ని సందర్భాల్లో ఎమోషనల్‌గా లోన్లీగా ఉంటారు. ఆ సమయంలో మీకు ఓ తోడు కావాలి అనిపించొచ్చు. సొసైటీ ఒత్తిడి ఉంటుంది. సింగిల్‌గా ఉండటం మీకు నచ్చే విషయమైనా.. సింగిల్‌గా ఉన్నావు.. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావంటూ.. ఫ్యామిలీ సొసైటీ నుంచి ప్రెజర్ రావొచ్చు. ఒక్కోసారి ఆర్థికంగా మిమ్మల్ని మీరు ముందుకు తీసుకువెళ్లలేని పరిస్థితి ఎదురు కావొచ్చు. అప్పుడు మీకు ఓ పార్టనర్ తోడుగా ఉంటే.. లైఫ్ బాగుంటుందని అనిపించొచ్చు.
ఫ్యామిలీ సమస్యలను షేర్ చేసుకునే పర్సన్ ఉండరు. ఒక్కరే ప్రెజర్‌ని తీసుకోవాల్సి వస్తుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఉండొచ్చు. ఎంత హాలీడే అయినా.. స్పెషల్ డే అయినా.. ఒంటరిగానే సెలబ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిప్రెషన్, ఆందోళన ఎక్కువ కావొచ్చు. హెల్త్ బాలేనప్పుడు ఎవరైనా పక్కన ఉంటే బాగుండు అనే కోరిక ఎక్కువ అవుతుంది. ఇలాంటివన్నీ సింగిల్‌గా ఉంటే ఇబ్బంది పెడుతుంటాయి.
ఏం చేయాలంటే..
* సింగిల్‌గా ఉన్నప్పుడు పర్సనల్ గ్రోత్‌పై దృష్టి పెట్టాలి.
* ఫ్రెండ్స్, ఫ్యామిలీతో మంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలి.
* మీ హాబీలను వదులుకోకూడదు. ఫ్రీ టైమ్‌లో వాటిపై ఫోకస్ చేయాలి.
* సెల్ఫ్ కేర్ తీసుకోవాలి.
* పాజిటివ్‌గా ఉండాలి.
* ఎలాంటి పరిస్థితి ఎదురైనా కంగారు పడిపోకూడదు.
* ఓపెన్ మైండ్‌తో ఉంటే.. సమస్యలు ఎక్కువ రాకుండా ఉంటాయి.